తమన్నాపై హత్యాయత్నం కేసు..?
on Jun 27, 2017
.jpg)
టైటిల్ వినగానే మీరు ఏదేదో..ఊహించుకోకండి..తమన్నా సినీనటి, మిల్కీబ్యూటీ తమన్నా కాదు. ఆమె పేరు పెట్టుకున్న మరో మహిళ కథ. మహారాష్ట్రలోని భీవాండిలో అస్మాఅన్సారీ అలియాస్ తమన్నా తన భర్తతో కలిసి నివసిస్తోంది. అయితే అదే ప్రాంతంలో నివసిస్తున్న మరో మహిళతో ఆమె భర్తకు వివాహేతర సంబంధం ఉంది..ఎన్నో రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని తమన్నా పసిగట్టింది. తీరు మార్చుకోవాలని చెప్పినప్పటికీ ఆమె భర్త వినకపోవడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఆదివారం కూడా తమన్నా ఇదే విషయంపై భర్తతో గొడవపడింది. ఆ తర్వాతి రోజు సదరు మహిళ ఇంటికి తన భర్త వెళ్లాడన్న విషయం తెలుసుకున్న తమన్నా తాడో పేడో తేల్చుకోవడానికి వెంట కత్తితో ఆ మహిళ ఇంటికి వెళ్లింది. తన భర్తతో సదరు మహిళ సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక ఆగ్రహంతో మహిళపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది..కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమన్నాను అదుపులోకి తీసుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



