మిల్కీ బ్యూటీ డ్యూయల్ రోల్ లో ' అభినేత్రి '..!
on Jun 3, 2016

మిల్కీబ్యూటీ తమన్నా ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న సినిమా అభినేత్రి. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను తన ట్విట్టర్లో షేర్ చేశారు కోన వెంకట్. రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తూ అలరిస్తోంది తమన్నా. తమన్నా కెరీర్లోనే మొట్టమొదటిసారి, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ లో నటిస్తుండటం విశేషం. మూవీలో రెండు విభిన్న పాత్రలో తమన్నా కనిపిస్తుందని మూవీ వర్గాలంటున్నాయి.

ప్రభుదేవా, సోనూసూద్ లు కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ డిఫరెంట్ స్టోరీతో మూవీని రూపొందిస్తున్నారని, తమన్నా కెరీర్లోనే మర్చిపోలేని సినిమాగా అభినేత్రి నిలుస్తుందని కోన వెంకట్ చెబుతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజవబోతోంది ఈ మూవీ. అమీ జాక్సన్ ఐటెం సాంగ్ చేస్తుండగా, తమన్, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలు టీజర్ ను లాంఛ్ చేయబోతున్నారు కోన అండ్ కో.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



