జమున బయోపిక్ లో తమన్నా!
on Jan 31, 2023

మహానటి సావిత్రి బయోపిక్ గా రూపొందిన 'మహానటి' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి, అందులో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కి ఎంతో పేరు వచ్చింది. ఇప్పుడు మరో అలనాటి తార బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అలనాటి అగ్ర కథానాయికలలో జమున ఒకరు. సావిత్రి, జమున ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఇద్దరూ స్టార్స్ గా ఎదిగారు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో జమున 200 కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి స్టార్స్ సరసన ఎన్నో సినిమాల్లో నటించడమే కాకుండా.. ఆ స్టార్స్ నే ఛాలెంజ్ చేసిన నటిగా జమునకు పేరుంది. ఇటీవలే ఆమె కన్నుమూశారు. ఇప్పుడు ఆమె బయోపిక్ తీయడానికి తమిళ పరిశ్రమలో సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ బయోపిక్ కోసం ఓ బడా నిర్మాణ సంస్థ, ఒక ప్రముఖ దర్శకుడు చేతులు కలిపారని.. ఇందులో జమున పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుందని సమాచారం. సావిత్రి పాత్ర కీర్తి సురేష్ కి గొప్ప పేరు తీసుకొచ్చినట్లుగా.. తమన్నాకు కూడా జమున పాత్ర ఆస్థాయి పేరు తీసుకొస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



