ఇంతకు మించి చెప్పేదేం లేదంటూ సిగ్గుపడుతున్న తమన్నా!
on Jun 13, 2023

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి పక్కన భోళా శంకర్, తమిళ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ పక్కన జైలర్, బాలీవుడ్‌లో పాపులర్ యాంథాలజీ లస్ట్ స్టోరీస్‌కి సీక్వెల్‌తో యమా క్రేజ్ మీదున్నారు తమన్నా భాటియా. ఇప్పుడైతే ఆమె ఆనందానికి అవధుల్లేవు. అందుకు రీజన్ బిజీగా ఉండటం మాత్రమే కాదు, తన హ్యాపీ స్పేస్ దొరికినందుకు. తన హ్యాపీ ప్లేస్‌కి ఓ అడ్రస్ దొరికినందుకు. యస్.... రూమర్డ్ బోయ్‌ప్రెండ్ విజయ్ వర్మ గురించి నోరు విప్పారు తమన్నా భాటియా. లస్ట్ స్టోరీస్2 సెట్స్ లోనే అంతా మొదలైందని అంటున్నారు మిస్ మిల్కీ బ్యూటీ. ఎట్టకేలకు, తన గురించి, విజయ్‌వర్మతో లవ్ గురించి నోరు విప్పారు తమన్నా భాటియా. తమ ప్రేమ కథకు నాంది పలికింది లస్ట్ స్టోరీస్2 సెట్స్ అని చెప్పారు. ఈ సీరీస్‌లోనే తమన్నా, విజయ్ వర్మ కలిసి పనిచేశారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు ఈ సీరీస్‌కి.
న్యూ ఇయర్ పార్టీలో గోవాలో ఒకరికొకరు ముద్దుపెట్టుకుంటూ కనిపించారు తమన్నా, విజయ్ వర్మ. అప్పుడెప్పుడో ఆవారా చేసేటప్పుడు కార్తీతో ప్రేమలో పడ్డారనే రూమర్స్ తప్ప, రిలేషన్ షిప్ గురించి తమన్నా మీద పెద్ద రూమర్స్ అయితే లేవు. అలాంటిది ఒక్కసారిగా ముద్దు సీన్‌లో కనిపించేసరికి ఫ్యాన్స్ కి షాక్ తగిలినట్టు అయింది. 33 ఏళ్ల తమన్నా ఒకింటివారు కాబోతున్నారంటూ వైరల్ చేశారు ఫ్యాన్స్. ``కలిసి పనిచేసినంత మాత్రాన మనం ఒకరికి అట్రాక్ట్ అవుతామని అనుకోకూడదు. నేను చాలా మందితో కలిసి పనిచేశాను. ఒకరి గురించి మనం ఆలోచిస్తున్నామంటే, ఒకరి గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే, అది మనసుకు సంబంధించిన వ్యవహారమై ఉండాలి. అంతే గానీ వాళ్ల జీవన విధానానికి ఇంప్రెస్ అయ్యో, ఇంకో రకంగానో అవన్నీ చేయలేం`` అని అన్నారు తమన్నా.
విజయ్‌ని చూసినా, మాట్లాడినా, అతనితో పనిచేసినా తనకు స్పెషల్‌గా అనిపించేదని, నచ్చేదని, లస్ట్ స్టోరీస్2 సెట్స్ తామిద్దరికీ చాలా కొత్త విషయాలను పరిచయం చేశాయనీ అన్నారు తమన్నా. విజయ్‌తో తన బాండింగ్ చాలా ఆర్గానిక్‌గా ఉంటుందని చెప్పారు. ``విజయ్ వర్మ నా హ్యాపీ ప్లేస్. మంచి పార్ట్ నర్‌గా ఉండాలంటే చాలా పనులు చేయాలి. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలి. వారికి కావాల్సినవన్నీ చేయాలి. కానీ నేను ఇప్పటిదాకా అవేం చేయలేదు. నా ప్రపంచంలో నేను బతికేదాన్ని. కానీ నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు విజయ్ వర్మ. నేను అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి అతనే`` అని అన్నారు. ఇంకో ఇంటర్వ్యూలో ప్రేమ గురించి ప్రస్తావన వస్తే ``అలాంటివి చాలా వస్తుంటాయి. వాటన్నిటినీ క్లియర్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు. దీని గురించి ఇంతకన్నా ఏమీ చెప్పలేను`` అని నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



