బాహుబలి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని
on Apr 26, 2017
.jpg)
సాధారణంగా స్టార్ హీరో సినిమాలకి ఒక రోజు ముందుగా కానీ, రిలీజ్ రోజు ఉదయం కానీ ఫ్యాన్స్, ప్రెస్ మరియు సెలెబ్రిటీల కోసం బెనిఫిట్ షోలు వేస్తారు. ఈ స్పెషల్ షో టికెట్ ప్రయిజ్ లు ఆకాశాన్నంటుతాయి. బాహుబలి క్రేజ్ ని ఉపయోగించుకొని రేట్లు పెంచుదాం అనుకున్న థియేటర్ యజమానులకు, ఎగ్జిబిటర్లకి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. "బాహుబలి 2 బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతి లేదు.. కేవలం రోజుకు ఐదు షోలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాం" అని సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీన్ని బట్టి బాహుబలి 2 ప్రీమియర్ షో టికెట్ రేట్లలో హైక్ ఉండదన్నమాట. అయితే, కొన్ని మల్టీప్లెక్స్ లలో టికెట్స్ వాళ్లే బ్లాక్ చేసి, కాంబో ఆఫర్లు పెట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వివరణ ఇచ్చారు. "బాహుబలి 2 సినిమాకు మా ప్రభుత్వం అన్ని విధాల సహకారం ఉంటుంది.. కానీ కొందరు టికెట్ రేట్ లు పెంచటం, కాంబో ఆఫర్స్ పెట్టి టికెట్ లు అమ్మటంపై సీరియస్ యాక్షన్ ఉంటుంది. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా ఉపేక్షించెది లేదు," అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏషియన్ మరియు కొన్ని ఇతర థియేటర్లలో బాహుబలి 2 పెయిడ్ ప్రీమియర్ షోల ఆన్లైన్ లో టిక్కెట్లు పెట్టిన కొంత సమయంలోనే అమ్ముడయ్యాయంటే బాహుబలి 2 కోసం మూవీ లవర్స్ ఎంతగా వేచి చూస్తున్నారో అర్ధమవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



