మెగా ఫాన్స్‌కు పండగలాంటి న్యూస్.. 18న 'సైరా' ఆడియో ఈవెంట్
on Sep 11, 2019

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించిన 'సైరా.. నరసింహారెడ్డి' అక్టోబర్ 2న విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్ట్ 20న రిలీజ్ చేసిన టీజర్ తర్వాత ఇప్పటివరకూ ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదని ఒకింత అసంతృప్తితో ఉన్న మెగా ఫాన్స్ కు సంబరం చేసుకొనే అప్డేట్ తెలిసింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'సైరా' మూవీ ఆడియో ప్లస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న జరగనున్నది. ఈ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించడానికి నిర్మాత, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధినేత రాంచరణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం లక్ష మంది అభిమానులు పట్టే వేదిక కోసం చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు కర్నూలు వేదిక కానున్నది. సినిమాకు పనిచేసిన తారాతోరణమంతా ఈ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. అలాగే ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవనున్నారు.
మొదట ఆగష్టు 14న వచ్చిన మేకింగ్ వీడియో, తర్వాత 20న వచ్చిన టీజర్ 'సైరా'పై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి ఆహార్యం, రెండు కరవాలాలతో ఆయన చేసిన పోరాటాలు చూశాక, ఈ మూవీ టాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 'బాహుబలి 2' క్రియేట్ చేసిన రికార్డుల దరిదాపుల్లోకి మరే తెలుగు సినిమా రాలేదు. 'సాహో' సైతం ఈ విషయంలో ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలో 'సైరా'పై ఫాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ మూవీ చరిత్ర సృష్టిస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు.
అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, తమన్నా, రవికిషన్ వంటి సుప్రసిద్ధ తారలు నటించిన ఈ సినిమాకు రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీ బిగ్ ఎస్సెట్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



