పెద్దిలో చరణ్ కి తల్లిగా ఆఫర్ వదులుకున్న ప్రముఖ అగ్ర నటి
on Aug 24, 2025

ఈ సారి ఎలాగైనా రికార్డులు సృష్టించాలని 'గ్లోబల్ స్టార్ రామ్ చరణ్'(Ram charan)ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని చేస్తున్న చిత్రం 'పెద్ది(Peddi).'రూరల్ స్థాయిలో జరిగే పలు క్రీడల్ని బేస్ చేసుకొని, పక్కా హై వోల్టేజ్ యాక్షన్ సబ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో పాటు, చరణ్ లుక్ తో 'పెద్ది' పై పూర్తి స్థాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగిస్తున్నాయి. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు 'పెద్ది' కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
రీసెంట్ గా ప్రముఖ మలయాళ నటి 'స్వాసిక' ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ ‘పెద్ది’లో నాకు ఆఫర్ వచ్చింది. కానీ ఆ ఆఫర్ ని తిరస్కరించాను. ఎందుకంటే చరణ్ కి తల్లి క్యారక్టర్ గా చెయ్యమన్నారు. ప్రస్తుతానికైతే చరణ్‌కి మదర్ రోల్‌లో నటించేందుకు సిద్ధంగా లేను. ఒకవేళ భవిష్యత్తులో ఆ తరహా క్యారక్టర్ లు వస్తే చేస్తానేమో అని చెప్పుకొచ్చింది. 'కేరళ'లోని 'ఎర్నాకులం' కి చెందిన స్వాసిక 2009 లో 'వేగై' అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశించింది. ఆ తర్వాత మలయాళ, తమిళ భాషల్లో హీరోయిన్, క్యారక్టర్ నటిగా పలు చిత్రాల్లో చేసి మంచి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. ఎలాంటి క్యారక్టర్ లోనైనా అవలీలగా పెర్ఫార్మ్ చేసి మెప్పించడం స్వాసిక నటనకి ఉన్న స్పెషాలిటీ. రీసెంట్ గా నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన 'తమ్ముడు' మూవీలో అటవీ జాతికి చెందిన మాస్ క్యారక్టర్ లో సూపర్ పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించింది. 2012 లో వచ్చిన 'ఎటు చూసినా నువ్వే' అనే చిత్రంలో స్వాసిక నే హీరోయిన్. ప్రస్తుతం సూర్య, ఆర్ జె బాలాజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'కరుప్పు' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది
ఇక పెద్దిలో చరణ్ సరసన దేవర భామ 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor)జత కడుతుంది. దీంతో ఆన్ స్క్రీన్ పై చరణ్, జాన్వీ ల ఫెయిర్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. గౌర్ నాయుడుగా కన్నడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమార్(Shiva Rajkumar)గా కనిపిస్తుండగా, స్టార్ యాక్టర్ జగపతిబాబు(Jagapathi Babu),దివ్యేంద్రు శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ,ఆస్కార్ విన్నర్ 'ఏఆర్ రెహ్మాన్'(Ar Rehman)సంగీతాన్ని అందిస్తున్నాడు. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



