Home

»

Latest News

అల్ల‌రి హీరోతో ఎస్వీ కృష్టారెడ్డి!!

May 1, 2019 3:13PM

 

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన చాలా షార్ట్ టైమ్ లోనే యాభై సినిమాలను కంప్లీట్ చేసిన హీరో అల్ల‌రి న‌రేష్‌.  కెరీర్ ప్రారంభంలో వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోయిన న‌రేష్ త‌ర్వాత‌ర్వాత వ‌రుస అప‌జ‌యాల‌తో కాస్త వెన‌క‌ప‌డ్డాడు.  స‌రైన హిట్ లేక స‌త‌మ‌వుతున్నాడు. ఇక హీరో పాత్ర‌లే కాకుండా ముఖ్య పాత్ర‌లు చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఇందులో భాగంగానే మ‌హేష్ న‌టిస్తోన్న `మ‌హ‌ర్షి` సినిమాలో మ‌హేష్ బాబు స్నేహితుడుగా న‌టిస్తున్నాడు. అలా చేస్తూనే మ‌రోప‌క్క స‌రైన స్టోరీ కోసం సెర్చ్ చేస్తున్నాడు.  అయితే తాజాగా ఒక న్యూస్ సోష‌ల్ మీడియాలో హ‌ల్  చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే... ఫ్యామిలీ, హాస్య  చిత్రాల స్పెష‌లిస్ట్ అయిన ఎస్వీ కృష్ణా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో న‌రేష్  ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే స్టోరీ వినిపించ‌డం సినిమా ఫైన‌ల్ చేయ‌డం కూడా జ‌రిగిపోయాయ‌ట‌. ఎస్వీఆర్ బేన‌ర్ లో చేయ‌బోయే ఈ సినిమా లో మ‌రో హీరో కూడా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com