
వరుస సక్సెస్ లతో దూసుకెళ్తోన్న యంగ్ హీరో శర్వానంద్ కు కోలీవుడ్ నుండి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రన్ రాజా రన్, శతమానంభవతి, మహానుభావుడు చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా మంచి మార్కెట్ ని ఏర్పరుచుకున్నాడు. ప్రజంట్ యంగ్ హీరోలు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా ఆ కోవలో చేరనున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఒక తమిళ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై కొత్త దర్శకుడి దర్శకత్వంలో తమిళ , తెలుగు భాషల్లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శర్వానంద్.
ఇక ప్రస్తుతం దిల్ రాజు బేనర్ లో శర్వానంద్ 96 రీమేక్ లో నటిస్తున్నాడు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. అగస్ట్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అలాగే ఇంకా కొన్ని స్క్రిప్ట్స్ ఫైనల్ చేసాడట శర్వానంద్.






