Home

»

Latest News

అర్జున్ కు డేట్ కుదిరింది!!

May 1, 2019 4:54PM

 

యంగ్ హీరో నిఖిల్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. కానీ విడుద‌ల విష‌యంలో మాత్రం క్లారిటి రావ‌డం లేదు. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు వాయిదా ప‌డింది.  తాజాగా మే 1న విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ ఈ డేట్ ను కూడా పోస్ట్ పోన్ చేసారు. ప్ర‌జంట్ థియేట‌ర్ల‌లో ఆడుతున్న సినిమాలు మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తుండ‌టంతో థియేట‌ర్ల ప్రాబ్ల‌మ్ వ‌స్తుంద‌ని సినిమాను వాయిదా వేసారు. ఇక మే 9న మ‌హేష్ మ‌హ‌ర్షి విడుద‌ల‌వుతుండ‌టంతో `అర్జున్ సుర‌వ‌రం` చిత్రాన్ని  మే 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు  తాజా స‌మాచారం.  త‌మిళంలో ఘన విజ‌యం సాధించిన `క‌నిత‌న్` కు రీమేక్ గా అర్జున్ సుర‌వరం చిత్రం తెర‌కెక్కింది. నిఖిల్ స‌ర‌స‌న లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా న‌టిచింది. మ‌రి ఇన్నిసార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన సినిమా మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఏ మేరకు ఆక‌ట్టుకుంటుందో చూడాలి అంటున్నారు సిని జ‌నాలు. అయితే నిఖిల్ మాత్రం గ‌తంలో వాయిదా ప‌డుతూ వ‌చ్చిన నా సినిమాలు పెద్ద స‌క్సెస్ సాధించాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ‌డం ఖాయం అంటున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com