కీర్తి సురేష్ తో సుశాంత్ ప్రేమాయణం!
on Mar 19, 2023
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. తమిళ సినిమా 'వేదాళం'కు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
'కరెంట్', 'చి ల సౌ' వంటి సినిమాలలో హీరోగా నటించి ఆకట్టుకున్న సుశాంత్.. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'అల వైకుంఠపురములో' సినిమాలో ముఖ్య పాత్ర పోషించి మెప్పించిన సుశాంత్.. త్వరలో విడుదల కానున్న రవితేజ 'రావణాసుర'లో పవర్ ఫుల్ పాత్రలో అలరించనున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్'లోనూ నటించే అవకాశం దక్కించుకున్నాడు. శనివారం నాడు సుశాంత్ పుట్టినరోజు కావడంతో ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి గారి సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని సుశాంత్ అన్నాడు. కాగా 'భోళా శంకర్'లో కీర్తి ప్రియుడిగా సుశాంత్ కనిపించనున్నాడని సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
