.jpg)
సూర్య మూడు పాత్రలో, విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా 24. విడుదలైన రోజు నుంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోందీ సినిమా. సూర్య నటనతో పాటు విక్రమ్ కథను చెప్పిన విధానం, సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. విచిత్రంగా తమిళనాడులో మాత్రం సినిమాకు కలెక్షన్లు లేవు. అక్కడ యావరేజ్ టాక్ తో నడుస్తున్న సినిమా మిగిలిన అన్ని చోట్లా, సక్సెస్ ఫుల్ టాక్ తో పాటు, కలెక్షన్లు కూడా కుమ్మేసుకుంటోంది. కేవలం వారం రోజుల్లోనే గ్లోబల్ గా 75 కోట్ల గ్రాస్ సాధించి, వందకోట్ల క్లబ్బు వైపు శరవేగంగా దూసుకుపోతోంది.
తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం 22 కోట్లు సాధించిన ఈ సినిమా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో 16 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ల షేర్ 10.3 కోట్ల వరకూ వచ్చిందని, సూర్య సినిమాల్లో ఇది రికార్డ్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర 4.8 కోట్లు, కేరళ లో 7,93 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1.30 కోట్లు సాధించింది. నార్త్ అమెరికాలో 1,292,988 డాలర్లు, ఆస్ట్రేలియాలో 219,898 డాలర్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఓవర్సీస్ మార్కెట్ లో వారం రోజుల్లో 23 కోట్లు కొల్లగొట్టింది. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గ్రాస్ లో 75 కోట్ల జోన్ లోకి ఎంటరైన 24, వంద కోట్ల టార్గెట్ వైపు పరుగులు పెడుతోంది. ఒక్క తమిళనాడు తప్పితే రిలీజైన మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు టేబుల్ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైపోయారు. తమిళనాడులో టాక్ బాగున్నా టికెట్లు ఎక్కువగా తెగకపోవడం విచిత్రం.






