Home

»

Latest News

గాయపడిన మహేష్ బాబు హీరోయిన్...!

May 14, 2016 3:17PM

మహేష్ బాబు సరసన నేనొక్కడినే సినిమాలో కనిపించి మురిపించింది కృతి సనన్. ఆ తర్వాత దోచెయ్ లో నాగచైతన్యతో కలిసి నటించినా ఈ భామకు హిట్ దొరకలేదు. తెలుగులో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో హీరోపంటి తో ఇంట్రడ్యూస్ అయింది. షారుఖ్ సినిమా దిల్ వాలేలో నటించింది. అయితే బాలీవుడ్ లో కూడా పాపకు హిట్లు లేవు. ప్రస్తుతం కృతి చేస్తున్న బాలీవుడ్ సినిమా రాబ్తా. బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హంగరీ లోని బుడాపెస్ట్ లో జరుగుతోంది. షూటింగ్ సమయంలో ఒక ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు కృతి గాలికి గాయమైందట. ఒక కోట గోడపై పరిగెడుతున్న సమయంలో, కాలు మడతపడి మడమ దగ్గర ఫ్రాక్చర్ అయిందని సమాచారం. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసిన మూవీ టీం, ఆమెను రెస్ట్ తీసుకొమ్మని చెప్పారట. షూటింగ్ కంటిన్యూ చేద్దామని కృతి అడిగినప్పటికీ, దర్శకుడు దినేష్ విజాన్ పోస్ట్ పోన్ చేశాడట. మరో రెండు రోజుల్లో షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com