Home

»

Latest News

విమానంలో మాజీ ఎరోటిక్ స్టార్ రచ్చ రంబోలా..!

May 14, 2016 1:12PM

హాలీవుడ్ లో దశాబ్దాల క్రితం ఎరోటిక్ సినిమాలతో ఊపు ఊపేసిన శృంగార తార హార్లీ మెక్ బ్రైడ్. ఇప్పుడు మందుకు అలవాటు పడిపోయిన ఈ ముదురుభామ తాను ప్రయాణిస్తున్న విమానంలో రచ్చ రచ్చ చేసి, ప్లేన్ ను కిందకు దింపేసింది. విషయంలోకి వెళ్తే, 67 ఏళ్ల హార్లీ న్యూయార్క్ నుంచి ఫ్రాన్స్ వెళ్తున్న బోయింగ్ విమానంలో ప్రయాణిస్తోంది. అప్పటికే గట్టిగా మద్యం పట్టించేసిన ఈవిడ గారు, మరింత లిక్కర్ తీసుకురమ్మని ఎయిర్ హోస్టస్ ను అడిగింది. కానీ ఈ ఏజ్ లో లిక్కర్ ఓవర్ అయిపోతుందని నచ్చజెప్పడానికి చూశారు విమానం సిబ్బంది. వాళ్లు మందు తేకపోవడంతో రెచ్చిపోయిన హార్లీ, విమానంలో వీరంగం వేసేసింది. ఆమె రభస తట్టుకోలేక, అర్జెంట్ ప్లాస్టిక్ చైర్ కు ఆమెను కట్టేసి, విమానాన్ని దగ్గర్లోని గాండర్ ఎయిర్ పోర్ట్ లో దింపేశారు. ఈమె చేసిన దానికి కోర్టు దాదాపు 19 లక్షల భారీ జరిమానా విధించింది. 1970ల్లో మసాలా సినిమాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంది హార్లీ. రిచర్డ్ బెల్జర్ అనే కమెడియన్ నటుడిని 1985లో పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. న్యూయార్క్ లో జరిగిన తన సోదరుడి అంత్యక్రియలకు హాజరై వస్తున్న మెక్ బ్రైడ్, ఆ బాధలో ఇలా ప్రవర్తించి ఉంటుందని హాలీవుడ్ జనాలు భావిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com