Home

»

Latest News

జ్యోతిక విషయంలో సూర్య 'నిర్ణయం' అదే.. శివకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.!

Sep 28, 2026 3:08PM

తమిళ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికల ప్రేమకథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడి 2006లో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మరోసారి వివాహ ప్రమాణాలను చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్.. తన కుమారుడి ప్రేమ, పెళ్లి విషయంలో అప్పట్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

సూర్య జ్యోతికను ప్రేమిస్తున్న విషయం తెలిసిన సమయంలో తాను మొదట అంగీకరించలేదని శివకుమార్ వెల్లడించారు. అయితే జ్యోతికను మాత్రమే పెళ్లి చేసుకుంటానని సూర్య చాలా పట్టుదలగా చెప్పాడట. నాలుగేళ్ల పాటు తన నిర్ణయంపై సూర్య వెనక్కి తగ్గకుండా ఎదురుచూశాడని శివకుమార్ తెలిపారు. తన తల్లి ప్రేమ గురించి అడిగినప్పుడు.. ఎవరినైనా ప్రేమించడం అంత సులభం కాదని సూర్య చెప్పేవాడని, చివరకు జ్యోతికను ప్రేమించిన తర్వాత ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని గుర్తుచేసుకున్నారు.

అయితే మొదట్లో కొడుకు ప్రేమను వ్యతిరేకించిన శివకుమార్.. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. తాను నటించిన ఎన్నో సినిమాల్లో ప్రేమ వివాహాల గురించి కథలు ఉన్నాయని గుర్తుచేసుకుని, చివరకు సూర్య నిర్ణయాన్ని అంగీకరించినట్లు గతంలోనే వెల్లడించారు. అలాగే సూర్యకు జ్యోతికతో మాట్లాడే విషయంలో సంకోచం ఉండేదని, నటి రాధికా శరత్‌కుమార్ వారిద్దరి మధ్య పరిచయం పెరగడానికి సహకరించారని కూడా ఆయన చెప్పారు.

ఇక పెళ్లి తర్వాత జ్యోతిక తమ కుటుంబంతో 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న విషయాన్ని కూడా శివకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సూర్యను తనతో కలిసి ముంబైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. ఆమె అలా చేయకుండా కుటుంబంతో కలిసి ఉన్నారని తెలిపారు. సూర్య, జ్యోతిక దంపతులకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న ఈ జంట ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ ప్రమాణాలను మరోసారి చేసుకోవడంతో ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

 

[Suriya Jyotika Love Story, Suriya Marriage, Jyotika Marriage, Sivakumar About Suriya Jyotika, Suriya Father Sivakumar, Suriya Jyotika Wedding, Suriya Jyotika 20th Anniversary, Tamil Actor Suriya, Jyotika Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com