Home

»

Latest News

బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్: వాళ్ళు అదృష్టవంతులే!

Sep 28, 2026 2:59PM

 

 

సొంత చిత్రాల కంటే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులు మలయాళ చిత్రాలని ఆదరిస్తున్న విషయం తెలిసిందే.  అది కూడా ఓటిటిలోకి వస్తే మాత్రం తిండి తిప్పలు సైతం మాని ఇంటిల్లిపాది వచ్చి రాని మలయాళ భాష మాట్లాడుకుంటూ మరి ఆస్వాదిస్తున్నారు. ఇందులో ఎలాంటి వెన్నుపోటు రాజకీయాలు లేవు. కంటెంట్ బాగుండటమే అందుకు ఆదరణ. కంటెంట్ బాగుంటే మిగతా ప్రాంతీయ విషయాలన్నీ పక్కన పెట్టెయ్యడం తెలుగు సినీ ప్రేక్షకుడి స్టైల్. ఇప్పుడు మరో సారి  "బెత్లెహేమ్ కుటుంబ యూనిట్" తో మైమరిచిపోనున్నారు.

 నివిన్ పౌలీ,  మమితా బైజు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 'ప్రేమలు' వంటి బ్లాక్‌బస్టర్ అందించిన గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, కేవలం. 25 కోట్ల నిర్మాణ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా  326.98 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సర్వత్రా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారతదేశంలోనే దాదాపు 162.10 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

ఇది కూడా చదవండి: వ్యభిచార కేసులో అడ్డంగా బుక్కైన ప్రముఖ హీరోయిన్..ఎవరెవరు ఉన్నారంటే!

 


 ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) అధికారికంగా స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుంది.

తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో ఇక్కడి ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ లభించింది. థియేటర్లలో సుదీర్ఘ కాలం పాటు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మరి అక్టోబర్ 2 న ఎంజాయ్. 

 

[Bethlehem kudumba Unit Ott Release Date, Bethlehem Kudumba Unit OTT, Nivin Pauly, mamitha Bhaiju, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]


   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com