మనల్ని ఎవడ్రా ఆపేది..80 కోట్లు నిజమేనంటారా!
on Jan 17, 2025
స్టార్ హీరో సూర్య గత అక్టోబర్ లో 'కంగువ'(Kanguva)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ని చవి చూసింది.దాదాపుగా 300 వందల కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకున్న ఈ మూవీ అన్నిభాషల్లో కలిపి కేవలం100 కోట్లు మాత్రమే వసూలు చేసేంత భారీ డిజాస్టర్ ని అందుకుంది.
కానీ ఇపుడు ఆ పరాజయం యొక్క ప్రభావం సూర్య(Suriya)అప్ కమింగ్ సినిమాల మీద పడలేదనే మాటలు వినిపిస్తున్నాయి.కంగువ తర్వాత సూర్య నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోయే మూవీ'రెట్రో'.ఈ మూవీ ఓటిటి హక్కులని నెట్ ఫ్లిక్క్స్ సంస్థ దక్కించుకుందని,ఈ మేరకు ఎనభై కోట్ల భారీ మొత్తాన్ని మేకర్స్ కి చెల్లించిందనే వార్తలు సినీ సర్కిల్స్ లో జోరుగా వినపడుతున్నాయి.కార్తీక్ సుబ్బరాజ్(Karthik SUbbaraj)దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రెట్రో'(Retro)లో సూర్య సరసన హిట్ చిత్రాల భామ పూజాహెగ్డే(Pooja Hegde)హీరోయిన్ గా చేస్తుంది.ఇప్పటికే రిలీజైన టీజర్ సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా సూర్య లుక్ కూడా వింటేజ్ సూర్యని చూపిస్తుండటంతో మూవీ రిలీజ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు.
ఒక విభిన్నమైన సబ్జెట్ తో తెరకెక్కుతున్న 'రెట్రో' సూర్య నుంచి వస్తున్న 44 వ చిత్రం.కొన్ని రోజుల క్రితం 45 వ చిత్రం కూడా స్టార్ట్ అయ్యింది.ఇటీవలే షూటింగ్ ని కూడా ప్రారంభించుకున్న ఈ మూవీకి ఆర్ జె బాలాజీ(Rj balaji)దర్శకుడు కాగా త్రిష(Trisha)హీరోయిన్ గా చేస్తుంది. రెండు చిత్రాలు కూడా ఏక ధాటిగా షూటింగ్ ని జరుపుకుంటున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
