తెలుగు స్టార్స్ ని తలపించేలా 'యానిమల్' బుకింగ్స్!
on Nov 29, 2023
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి డైరెక్టర్ కావడంతో తెలుగునాట కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
హైదరాబాద్ లో మొదటి రోజుకి గాను యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. హిందీ, తెలుగు వెర్షన్ కలిపి మొత్తం షోలు సుమారుగా 550 కాగా, ఇప్పటికే అందులో ఫాస్ట్ ఫిల్లింగ్ లేదా సోల్డ్ అవుట్ అయిన షోలు 300కి పైగా ఉన్నాయి. దీంతో డే-1 హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటిదాకా రూ.3.20 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇది షారుఖ్ ఖాన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'జవాన్' డే-1 హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ కంటే ఎక్కువ కావడం విశేషం. పైగా ఇంకా సమయం ఉండటంతో యానిమల్ హైదరాబాద్ డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముంది. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా, హిందీ సినిమాల పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యానిమల్ సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
