మళ్లీ మారిన రోబో రిలీజ్ డేట్
on Dec 3, 2017

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రోబో 2.0 కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ అది రోజు రోజుకు ఇంకా దూరం జరుగుతూనే ఉంది కానీ డేట్ మాత్రం ఫిక్స్ అవ్వడం లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 2018 జనవరి 26న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా పూర్తికాకపోవడంతో మరోసారి సినిమా విడుదలను 2018 ఏప్రిల్ 27కి మారుస్తున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంత వరకు ఎవరు వాడని స్థాయిలో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శంకర్. డిసెంబర్ 12న సూపర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. అయితే వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో ట్రైలర్ రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి లైకా ప్రొడక్షన్స్ నిర్ణయం తలైవా అభిమానులను తీవ్ర నిరాశలో ముంచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



