Home

»

Latest News

మ‌హేష్ - కొర‌టాల‌.. భ‌లే టైటిల్‌

Oct 31, 2016 7:16PM

శ్రీమంతుడుతో మ‌హేష్ బాబుకి సూప‌ర్ స‌క్సెస్ ఇచ్చాడు కొర‌టాల శివ‌. అందుకే మ‌రోసారి వీరిద్ద‌రి కాంబోకి రంగం సిద్ద‌మైంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు - మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే కొర‌టాల శివ సినిమ మొద‌లైపోతుంది. ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నుల్లో మునిగిపోయాడు కొర‌టాల శివ‌. ఇందులో మహేష్ ముఖ్య‌మంత్రి గా క‌నిపించ‌నున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌.

ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. 'భ‌ర‌త్ అను నేను' అనే టైటిల్‌ని ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నార్ట‌. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేట‌ప్పుడు పేరు చెప్పి.. అప్పుడు ప్ర‌మాణం చేస్తారు. సో.. దాన్ని హైలెట్ చేస్తూ.. కొర‌టాల ఈ పేరు పెట్టాడ‌న్న‌మాట‌. మ‌హేష్ లాంటి హీరోకి ఇలాంటి సాఫ్ట్ టైటిల్ కొత్త‌గానే ఉంటుంది మ‌రి. అన్న‌ట్టు ఈ సినిమాలో మ‌రో హీరో కూడా క‌నిపిస్తాడ‌ని కొద్ది రోజుల క్రింద‌ట భీక‌ర‌మైన ప్ర‌చారం జ‌రిగింది. దాన్ని కొర‌టాల శివ త్రోసి పుచ్చారు. మ‌రి ఈ టైటిల్ పై ఆయ‌న ఏమంటాడో చూడాలి. కామ్‌గా ఉన్నాడంటే... ఈ టైటిలే ఖాయ‌మైపోయిన‌ట్టు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com