Home

»

Latest News

కబాలిపై ఫ్యాన్స్ ట్వీట్స్: బాగుందన్నారా..బాగోలేదన్నారా?

Jul 22, 2016 11:47AM

భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఇవాళ ధియేటర్లలో ల్యాండ్ అయ్యాడు. తమ అభిమాన హీరో నటించిన సినిమాను ఫస్ట్‌డే ఫస్ట్‌ఫో చూడాలన్న ఉద్దేశ్యంతో తెల్లవారుజాము నుంచే అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఎలాగో టిక్కెట్లు సంపాదించిన సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా సినిమా అప్‌డేట్స్‌ను తమ సన్నిహితులతో పంచుకున్నారు. సినిమా చాలా బాగుందని రజనీ అభిమానులు అంటుంటే అంత గొప్పగా ఏంలేదని మామూలు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

ఆ విధంగా అభిమానులు చేసుకున్న ట్వీట్లు ఇలా ఉన్నాయి:

కబాలి చాలా బాగుందని మలేషియాలో సినిమా చూసిన ఓ యువ అభిమాని ట్వీట్‌ చేసింది. తలైవా కనిపించినప్పుడల్లా కూర్చీలోంచి లేచి విజిల్స్, కేకలు వేయకుండా ఉండలేకపోయాయని పోస్ట్ చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద థియేటరైన ఫ్రాన్స్‌ గ్రాండ్ ఫిక్స్ థియేటర్‌లో కబాలి సినిమా ప్రదర్శన సందర్భంగా రజనీ తెరపై కనిపించినపుడు సందడి చేసిన ఫోటోను ట్విట్టర్‌లో పెట్టాడు మరో అభిమాని

సినిమా నెమ్మదిగా ఉందని, చాలా సన్నివేశాలు బోర్ కొట్టించాయని ఒక ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు.

కబాలి అనుకున్నంతగా ఏమి లేదని..తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని మరో అభిమాని వాపోయాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com