Home

»

Latest News

రజనీకాంత్ వెయిట్ చేస్తున్న ఫోన్ కాల్ ఎవరిదో తెలుసా..?

Jul 22, 2016 11:28AM


' కబాలి'.. 'కబాలి'.. 'కబాలి'.. గత రెండు మూడు రోజుల నుండి ఎక్కడ చూసినా ఈ పదం తప్ప వేరే ఏ వినిపించడం లేదు. అంతలా కబాలి ఫీవర్ అటాక్ అయింది ప్రేక్షకులకు. ఇక్కడే అలాగ ఉంటే.. ఇంక తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలం. ఇక సినిమా టికెట్ల కోసం అభిమానులు ఎంతలా పడిగాపులు కాస్తున్నారో చెప్పలేం. అంతేకాదు సినిమా ఎలా ఉంటుందబ్బా అని కూడా అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తుననారు. అయితే అందరి సంగతేమో కానీ.. మన 'కబాలి' అదేనండి రజనీ కాంత్ మాత్రం ఒక్కరి కోసం ఎదురుచూస్తున్నారంట. ఇంతకీ రజనీ ఎదురుచూసే అంత గొప్ప వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? ఆ వ్యక్తి ఎవరో కాదు ఒకప్పుడు రజనీ కండెక్టర్ గా పనిచేసిన బస్సు డ్రైవర్ రాజ్ బహదూర్ కోసం.

 

1970ల్లో బెంగళూరులోని శ్రీనగర్‌-కెంపెగౌడ ప్రాంతానికి వెళ్లే రూట్‌10ఎ బస్సుకి రజనీ కండక్టర్‌గా పనిచేశారు. ఆ బస్సు డ్రైవరే ఈ రాజ్‌ బహదూర్‌. అప్పటినుంచి వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. అంతేకాదు కొన్నిథియేటర్‌ యజమానులు సైతం బహదూర్ దగ్గరకు వచ్చి తమ థియేటర్లో సినిమా చూడాలని.. తాను వస్తే రజనీకాంత్ వచ్చి చూసినట్టేఅని అంటుంటారని బహదూర్ చెప్పుకొచ్చారు. ఇంక 'కబాలి' గురించి ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రోజు సినిమా చూడాల్సిందే.. రజనీకి ఫోన్‌ చేసి ఎలా ఉందో చెప్పాల్సిందే అని అంటున్నాడు. ఇంక రజనీ కూడా ఇప్పటికీ తన సినిమాలి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి బహదూర్ ఫోన్ కోసం ఎదురుచూస్తుండటం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి ఆయన గొప్ప వ్యక్తిత్వం అర్థమవుతోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com