
తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు చేసే హడావుడి అంతా..ఇంతా ఉండదు. ఎలాగైనా సరే కష్టపడి తమ హీరో సినిమా టికెట్లు సంపాదించి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాల్సిందే. అయితే ఆ అభిమానం కాస్త పీక్స్ కి వెళితే ఇదిగో ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా 'కబాలి' ఈరోజు విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్నసంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ షో కి టికెట్లు దొరకలేదని ఓ అభిమాని సూసైడ్ చేసుకున్నాడు. మలేసియా లోని కేన్ సీసీ ప్రాంతంలో అక్కడి 10 అంతస్తుల భవనం నుంచి కిందికి దూకి ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి అభిమానం ఉండే కష్టమే.






