కాలా లేకపోతే సూర్య, భరత్‌లు తగ్గేవాళ్లా..?
on Feb 23, 2018

మహేశ్ భరత్ అనే నేను, బన్నీ నా పేరు సూర్య సినిమాల మధ్య రిలీజ్ డేట్ కోసం వచ్చిన క్లాష్‌కి ఎండ్ కార్డ్ పడింది. మహేశ్ సినిమా వారం ముందుకీ... బన్నీ సినిమా వారం వెనక్కీ వెళ్లిపోయాయి. దిల్‌రాజు, కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, జెమిని కిరణ్, సురేశ్ బాబు తదితర పెద్దలంతా కూర్చొని మాట్లడటం వల్ల ఇరు పక్షాల వల్ల రాజీ కుదిరింది.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు నష్టపోకూడదని.. పరిశ్రమకి ఇది మంచిది కాదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని భుజాల మీద చేతులు వేసుకుని... ఫోటోలకు ఫోజులిచ్చారు.
అయితే రెండు నెలల క్రితం ఈ ఆలోచన రాలేదా..? ఎవరి కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.. అప్పుడు గుర్తుకు రాని ఆరోగ్యకరమైన వాతావరణం.. ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సోషల్ మీడియాలో నిర్మాతలపై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. నా పేరు సూర్య, భరత్ అనే నేను సినిమాలను మొదట ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని భావించారు.
రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రావడం మంచిది కాదని.. ఎవరో ఒకరు మనసు మార్చుకోవాలని బయ్యర్లు కోరారు. మాట వరసకు ఇరు పక్షాలు అడపాదడపా కూర్చుంటున్నాయి. తప్పించి.. ఆ చర్చలు ఒక దారికి రాలేదు. ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు.. ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గుతారులే అన్న ధీమా.. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సినిమా "కాలా"ను ఏప్రిల్ 27నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో.. ఇద్దరు నిర్మాతలు నిద్రలోంచి లేచారు.. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టి.. ఎలా ముందుకు వెళ్లాలి అంటూ చర్చలు జరిపారు. రజనీ వస్తే రెండు సినిమాలకు మంచిది కాదని.. ఇద్దరం కాంప్రమైజ్ అవుదామని డిసైడ్ అవ్వడంతో మహేశ్ ఏప్రిల్ 20కి.. బన్నీ మే 4కి షిఫ్ట్ అయ్యారు. మొత్తానికి ఇరు పక్షాలు కలిసి రజనీకి దారిచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



