Home

»

Latest News

విజ‌య‌నిర్మ‌ల.. ఓ చీటింగ్ కేసు

Nov 2, 2016 11:38AM

ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్‌ని ఆశ్ర‌యించారు. ముగ్గురు వ్య‌క్తుల‌పై చీటింగ్ కేసు పెట్టారు. వివ‌రాల్లోకి వెళ్తే.....2007లో శ్రీ‌నివాస‌రాజు, భ‌ద్ర‌, సీతారామ‌రాజు అనే ముగ్గురు వ్య‌క్తుల‌కు విజ‌య నిర్మ‌ల కోటి రూపాయ‌లు అప్పుగా ఇచ్చారు.  కొంత‌కాలంగా అప్పు తీర్చ‌మ‌ని అడుగుతున్నా... ఈ ముగ్గురూ... అప్పుడు, ఇప్పుడు అంటూ కాల‌క్షేపం చేస్తూ వ‌స్తున్నార్ట‌. కాస్త గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో... కోటి రూపాయ‌ల‌కు చెక్కు రాసిచ్చారు. అది కాస్తా బౌన్స్ అవ్వ‌డంతో విజ‌య నిర్మ‌ల పోలీసుల‌ను ఆశ్ర‌యించాల్సివ‌చ్చింది.  మంగ‌ళ‌వారం సాయింత్రం జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో ఈ ముగ్గురిపై చీటింగ్ కేసు న‌మోద‌య్యింది. పోలీసులు వివ‌రాలు సేక‌రించి ద‌ర్యాప్తు మొద‌లెట్టారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com