Home

»

Latest News

ట్రైల‌ర్‌ రివ్యూ : రెమో

Nov 2, 2016 11:52AM

దిల్ రాజు సాధార‌ణంగా డ‌బ్బింగ్ సినిమాల‌కు దూరంగా ఉంటాడు. అలాంటిది ఓ డ‌బ్బింగ్ సినిమాని ఏరి కోరి.. ఎంచుకొన్నాడంటే దాంట్లో విష‌యం ఉండే ఉంటుంది.  భాగ్య‌రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌మిళ చిత్రం రెమోని తెలుగులో విడుద‌ల చేస్తున్నాడు దిల్‌రాజు. శివ‌కార్తికేయ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో... కీర్తి సురేష్ హీరోయిన్‌. శివ కార్తికేయ‌న్‌కు తెలుగులో అస‌లు మార్కెట్టే లేదు. అత‌ను న‌టించిన సినిమాలేవీ తెలుగులో పెద్ద‌గా విడుద‌ల కాలేదు. అయినా స‌రే.. కంటెంట్‌ని న‌మ్ముకొనే దిల్‌రాజు.. డ‌బ్బింగ్ చేయ‌డానికి ముందుకొచ్చాడు. ఈ సినిమా పాట‌లు, ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

 ట్రైల‌ర్ చూస్తే.. మ‌రో జంబ‌ల‌కిడి పంబ‌, భామనే స‌త్య‌భామ‌నే లాంటి సినిమాలు గుర్తొస్తున్నాయి. క‌థానాయ‌కుడు అనుకోని ప‌రిస్థితుల్లో ఆడ వేషం వేయ‌డం, మ‌గాడిగా... ఆడ‌దానిగా డ్యూయ‌ల్ రోల్ చేయ‌డం మ‌నం ఇది వ‌ర‌కు సినిమాల్లో చూశాం. దాన్నే ఇక్క‌డా రిపీట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.  కాక‌పోతే ఇక్క‌డ హీరోకి సినిమా పిచ్చి. వేసేది న‌ర్సు వేషం.. కాబ‌ట్టి కొత్త‌గానే ఉండే అవ‌కాశం ఉంది. దానికి తోడు... ట్రైల‌ర్ చూస్తుంటే ఊర కామెడీ సీన్లు మిక్స్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. పైగా నేను శైల‌జ‌తో కీర్తి సురేష్ తెలుగు వాళ్లంద‌రికీ ద‌గ్గ‌రైంది. ఆమె పేరు వాడుకొని ప్ర‌మోష‌న్లు చేసుకోవొచ్చు. దానికి తోడు పీసీ శ్రీ‌రాం, అనిరుథ్ లాంటి టెక్నీషియ‌న్ల అండ ఈసినిమాకి ద‌క్కింది. త‌మిళంలో సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకొన్న రెమో... తెలుగులో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకొంటుందో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com