Home

»

Latest News

గౌత‌మి జీవితంలో విల‌న్‌... శ్రుతిహాస‌న్‌

Nov 2, 2016 10:50AM

క‌మ‌ల్ హాస‌న్, గౌత‌మిల ప‌ద‌మూడేళ్ల బంధానికి తెర ప‌డింది. పుకార్ల‌కు తావివ్వ‌కుండా... మేం విడిపోతున్నాం అంటూ గౌత‌మి క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పేసింది. ఇప్పుడు అందరి ప్ర‌శ్నా ఒక్క‌టే. ఈ బంధం బీట‌లు వార‌డానికి కార‌ణం ఏమిటీ అని. అయితే ఈ టోట‌ల్ సీన్‌లో విల‌న్ గా క‌నిపిస్తోంది శ్రుతిహాస‌న్ మాత్ర‌మే.  శ్రుతికీ.. గౌత‌మికీ వ‌చ్చిన విబేధాల వ‌ల్లే... క‌మ‌ల్ తో గౌత‌మి విడిపోయింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌మ‌ల్ హాస‌న్ హీరోగా శ‌భాష్ నాయుడు అనే సినిమా తెర‌కెక్కుతోంది. త‌న కెరీర్‌లోనే తొలిసారి నాన్న‌తో క‌ల‌సి ఈ సినిమాలోనే న‌టిస్తోంది శృతి. ఇదే చిత్రానికి గౌత‌మి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తోంది. అయితే కాస్ట్యూమ్స్ విష‌యంలో వ‌చ్చిన విబేధాలు చినికి చినికి గాలివాన‌గా మారిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి.

ఈ విష‌యంలో శ్రుతి ఈగో బాగా హ‌ర్ట‌య్యింద‌ని, అప్ప‌టి నుంచీ క‌మ‌ల్‌, గౌత‌మిల జీవితంలో పుల్ల‌లు పెట్ట‌డం మొద‌లెట్టింద‌ని తెలుస్తోంది.  గౌత‌మి అంటే శ్రుతికి ముందు నుంచీ ఇష్టం లేద‌ని, ఈ మ‌ధ్య ఆ వ్య‌తిరేక‌త బాగా పెరిగింద‌ని చెన్నై వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. క‌మ‌ల్ హాస‌న్‌, శ్రుతిహాస‌న్ ఇద్ద‌రూ తండ్రీ కూతుర్లే అయినా.. పెద్ద‌గా క‌లిసుండేవారు కాదు. ఈ మ‌ధ్య వాళ్లిద్ద‌రి మ‌ధ్య రాపో బాగా పెరిగింది. ఇదే అలుసుగా తీసుకొని గౌత‌మిని దూరం పెట్ట‌డం మొద‌లెట్టింద‌ట శ్రుతి.  అటు శ్రుతికీ, ఇటు గౌత‌మికీ ఏమీ చెప్ప‌లేక క‌మ‌ల్ బాధ ప‌డేవాడ‌ని, ఆ బాధ‌ని దూరం చేయ‌డానికి అన్న‌ట్టు గౌత‌మి క‌మ‌ల్ నుంచి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలుస్తోంది.  మ‌నంద‌రికీ శ్రుతిహాస‌న్ హీరోయిన్ అయినా.. గౌత‌మి జీవితానికి మాత్రం త‌నే పెద్ద విల‌న్ గా మారింద‌న్న‌మాట‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com