Home

»

Latest News

పాపం సునీల్ ..!

Oct 18, 2016 5:00PM

ఎన్నో ఆశలతో సినిమాలు చేస్తుంటారు దర్శకనిర్మాతలు. తీరా సినిమా విడుదలై అనుకున్న లాభాలు రాకపోతే సర్లే శాటిలైట్ రైట్స్ కాపాడతాయి కదా అని ధైర్యం. అయితే పెద్ద హీరోలకు బాక్సాఫీసుతో పాటు బుల్లితెరపై కూడా కలెక్షన్ల వర్షమే. అయితే చిన్న హీరోల పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. వీళ్ల సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు శాటిలైట్ రైట్స్ రేటు కూడా బాగా పలుకుతాయి..కాని సినిమా అటు ఇటైతే మాత్రం బొమ్మ రివర్సే. ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్ధితిలోనే ఉన్నాడు సునీల్.

జక్కన్న కమర్షియల్‌గా ఓకే అనిపించుకున్నా..రూపాయి పెడితే..పావలా పోయింది... ఆ తర్వాత వచ్చిన ఈడు గోల్డెహె పరిస్థితి మరీ ఘోరం..రూపాయి పెడితే పావలా కూడా రాలేదు.. ఈ సినిమా విడుదలకు ముందు రెండు కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ వస్తే నిర్మాతలు వదులుకున్నారు. రెండున్నర ఇస్తే గానీ కుదరదు అన్నారు. ఇప్పుడు విడుదల తర్వాత పరిస్థితి మొత్తం రివర్స్ అయ్యింది. కోటికి కూడా గోల్డ్‌ని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. శాటిలైట్ మార్కెట్ ఎప్పుడైతే పడిపోయిందో..ఇక సునీల్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం కష్టమే. పాపం సునీల్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com