Home

»

Latest News

అత‌ని కోసం ఎన్టీఆర్ త‌హ‌త‌హ‌

Oct 18, 2016 4:53PM

జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత‌ ఎన్టీఆర్ సినిమా ఎవ‌రితో అనే విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ క్లారిటీ రాలేదు. పూరి జ‌గ‌న్నాథ్ ఎంపిక దాదాపుగా ఖాయం అనుకొంటున్నా.. ఏ క్ష‌ణంలో అయినా ఎలాంటి ప్ర‌క‌ట‌న అయినా వెలువ‌డొచ్చ‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఎన్టీఆర్‌కోసం న‌లుగురైదుగురు ద‌ర్శ‌కులు క‌థ‌లు సిద్దం చేసుకొన్నారు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం క‌థ‌ని, ద‌ర్శ‌కుడ్ని ఎంచుకొనే విష‌యంలో తొంద‌ర ప‌డ‌డం లేదు. ఎన్టీఆర్ దృష్టి ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ పై ఉంద‌ని, త్రివిక్ర‌మ్‌తో సినిమాచేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. ఎన్టీఆర్ కోసం ఓ క‌థ సిద్దం చేసుకోమ‌ని.. త్రివిక్ర‌మ్‌కి ఎప్పుడో పిలుపు వెళ్లిపోయింది. అందుకు ఆయ‌న సిద్ద‌మే కూడా. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్‌ల కాంబో సెట్ చేయాల‌ని కొంత‌మంది విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార్ట‌.

ఎన్టీఆర్ కూడా... 'త్రివిక్ర‌మ్ ఓకే అంటే నేనూ ఓకే' అంటున్నాడ‌ని, త్రివిక్ర‌మ్‌వైపు నుంచి ఎలాంటి క‌ద‌లికా రావ‌డం లేద‌ని టాక్‌. త్రివిక్ర‌మ్‌ని ఎన్టీఆర్ స‌న్నిహితులు ఈ విష‌యంలో బ‌ల‌వంతం చేస్తున్నారని, క‌థ రెడీ కాక‌పోయినా.. మీ నుంచి ఓ స్టేట్‌మెంట్ వ‌స్తే బాగుంటుంది, ఆ త‌ర‌వాత స్టోరీ రెడీ చేసుకోండి.. అంటున్నార‌ని, దానికి త్రివిక్ర‌మ్ స‌సేమీరా చెబుతున్నాడ‌ని టాక్‌. జ‌న‌తా గ్యారేజ్ ముందు కూడా ఇలానే జ‌రిగింది. ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబో సెట్ చేయ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. చివ‌రికి ఎన్టీఆర్‌ స్వ‌యంగా కొర‌టాల‌ని క‌ల‌సి.. ఈ ప్రాజెక్టుని ఓకే చేయించాడ‌ని, ఎన్టీఆర్ స్వ‌యంగా త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి కాద‌న‌లేక ఆ ప్రాజెక్టు ఒప్పుకొన్నాడ‌ని, ఇప్పుడూ త్రివిక్ర‌మ్ విష‌యంలో ఇదే జ‌రిగే అవ‌కాశం ఉందిని చెప్పుకొంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com