Home

»

Latest News

కంచె హీరోయిన్‌తో మెగా హీరో డేటింగ్..?

Oct 18, 2016 5:32PM

తెలుగు చిత్రసీమలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు చాలా మందే ఉన్నారు..ఇప్పటికే వన్ బై వన్ బ్యాచిలర్  లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేస్తున్నారు. ఇక మరికొందరు హీరోలు పీకల్లోతు ప్రేమలో విహరిస్తూ దానిని పెళ్లి పీటల దాకా తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. ఈ కోవలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. ఆమె ఎవరో కాదు కంచె సినిమా ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందున్న నక్షత్రం అనే సినిమాలో సాయిధరం తేజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో సాయికి జంటగా నటిస్తోంది ప్రగ్యా.

ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రోమాంటిక్ సీన్స్ ఆదిరిపోతాయట..అంత బాగా సీన్స్ రావాలంటే ఎంత కెమెస్ట్రీ జరగాలి..అందుకు కారణం వీరిద్దరూ డేటింగ్‌లో ఉండటమే. గతంలో రెజీనాతో సాయిధరమ్ తేజ్ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు నడిచాయి. అయితే ఏమయ్యిందోగానీ, ఇద్దరూ తమ ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడనే వార్తలు బయటకు రావడంతో ఫిలింనగర్‌లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. మరి వీరి డేటింగ్ ఎక్కడివరకూ వెళుతుందో వేచి చూద్దాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com