సంజయ్ దత్‌ను వదిలిపెట్టమని రేఖను కోరిన సునీల్ దత్!
on Sep 18, 2020

ఎవర్‌గ్రీన్ బ్యూటీ రేఖ, సంజయ్ దత్ కలిసి జమీన్ ఆస్మాన్ (1984) మూవీలో నటించారు. ఆ సినిమా షూటింగ్ స్టార్టయిన దగ్గర్నుంచీ సెట్స్‌పై వాళ్లిద్దరి మధ్య సన్నిహితత్వం పెరుగుతూ వస్తోందనే రూమర్లు గుప్పుమన్నాయి. వాళ్లిద్దరూ గంటలు గంటలు కలిసి గడుపుతూ వచ్చారు. కొడుకుకు ఎప్పుడూ నీడలా ఉండే తండ్రి సునీల్ దత్ చెవికి వాళ్ల వ్యవహారం చేరింది. దాంతో ఆయన ఆందోళన చెందారు. కెరీర్ మొదట్లోనే ఇలాంటి వ్యవహారాలు వద్దనీ, వాటికి దూరంగా ఉండమనీ సంజయ్‌కు గట్టిగానే చెప్పారు సునీల్. కానీ ఉడుకు రక్తం ఉరకలేస్తున్న వయసులో ఉన్న సంజయ్.. తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు.
రేఖ, సంజయ్ పెళ్లయిపోయిందని కూడా కొన్ని పత్రికలు కథలు రాసేశాయి. ఇది సునీల్ దత్‌ను బాగా బాధపెట్టింది. కొడుకు తన మాట పట్టించుకోకపోవడంతో, ఆయన అట్నుంచి నరుక్కు రావాలని భావించారు. ఈ విషయంపై రేఖతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. రేఖను కలిసిన ఆయన సంజయ్‌కు దూరంగా ఉండమని సూచించారు. సునీల్ దత్ అంటే బాలీవుడ్‌లో అందరికీ అమితమైన గౌరవం. ఆయన స్టేచర్ అలాంటిది. సునీల్ తనతో మాట్లాడాక.. సంజయ్‌కు దూరంగా మెలగడం మొదలు పెట్టారు రేఖ. ఓ ప్రముఖ ప్రతిక సంజయ్ దత్, రేఖ లవ్ స్టోరీ గురించి ప్రముఖంగా రాసింది. అయితే అందులో చెప్పినట్లు తాము పెళ్లి చేసుకోలేదని ఆ ఇద్దరూ ఖండించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



