హాకీ ప్లేయర్.. గ్యాంగ్ స్టర్.. అంబులెన్స్ డ్రైవర్.. సందీప్ లైనప్ అదుర్స్!
on Dec 22, 2020
వైవిధ్యానికి పెద్దపీట వేసే యువ కథానాయకుల్లో సందీప్ కిషన్ ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న 'ఏ1 ఎక్స్ ప్రెస్'తో పాటు 'రౌడీ బేబీ', 'వివాహభోజనంబు' చిత్రాల్లోనూ సందీప్ నటిస్తున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ మూడు సినిమాల్లోనూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో దర్శనమివ్వనున్నాడు సందీప్.
'ఏ1 ఎక్స్ ప్రెస్'లో హాకీ ప్లేయర్ గా నటిస్తున్న సందీప్ కిషన్.. యాక్షన్ నేపథ్యంలో అల్లుకున్న ప్రేమకథా చిత్రం 'రౌడీ బేబీ'లో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. ఇక తన నిర్మాణంలో తెరకెక్కుతున్న 'వివాహభోజనంబు'లో 20 నిమిషాల నిడివి గల ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో నెల్లూరు ప్రభ అనే అంబులెన్స్ డ్రైవర్ గా ఈ టాలెంటెడ్ యాక్టర్ సందడి చేయనున్నాడు. మొత్తమ్మీద.. డిఫరెంట్ రోల్స్ తో సందీప్ లైనప్ అదుర్స్ అనే చెప్పాలి.
మరి.. 2021లో తక్కువ గ్యాప్ లోనే రానున్న ఈ మూడు చిత్రాలు సందీప్ కి నటుడిగా ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి.