విడాకులు, రెండో పెళ్లి.. 'మళ్ళీ మొదలైంది' అంటున్న సుమంత్
on Jul 30, 2021
సుమంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మళ్ళీ మొదలైంది'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తోంది. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
'మళ్ళీ మొదలైంది' ఫస్ట్ లుక్ ను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. లైఫ్-ఆఫ్టర్-మ్యారేజ్ అంటూ మూడు డిఫరెంట్ మూడ్స్ లో సుమంత్, నైనా బెడ్ పై ఉన్న స్టిల్స్ ను పోస్టర్ లో చూపించారు. ఫస్ట్ స్టిల్ లో సుమంత్, నైనా దగ్గరగా ఉండటం.. సెకండ్ స్టిల్ లో ఎడమొహం పెడమొహంగా ఉండటం.. థర్డ్ స్టిల్ లో ఇద్దరూ దూరంగా ఉండటం.. ఈ ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల సుమంత్ వెడ్స్ పవిత్ర అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వెడ్డింగ్ కార్డు ఈ మూవీలోదే కావడం విశేషం.
ఇటీవల సుమంత్ రెండో పెళ్లి గురించి వార్తలొచ్చాయి. సుమంత్, పవిత్ర పేర్లతో ఉన్న వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సుమంత్ రెండో పెళ్లి నిజమేనని భావించారంతా. దానికి తోడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ లో నీకింకా బుద్ధి రాలేదా అంటూ సుమంత్ రెండో పెళ్లిపై కామెంట్స్ చేయడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే తన రెండో పెళ్లి వార్తల్లో నిజం లేదని సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. అది తన మూవీలోని వెడ్డింగ్ కార్డు అని, అది సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. అయితే సుమంత్ క్లారిటీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయింది. దీంతో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.