Home

»

Latest News

సుమలత సుముఖత చూపలేదట!

Jul 22, 2016 10:26AM

"హలో గురూ ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం" అని "నిర్ణయం" సినిమాలో నాగార్జున అమలను దృష్టిలో పెట్టుకొని ఓ పాటేసుకొంటాడు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసేసుకోని సెటిల్ అయిపోయారనుకోండి. అయితే.. నాగార్జునను రిజెక్ట్ చేసిన అమ్మాయి కూడా ఉందట. అసలు నాగార్జున సినిమాల్లోకి రాకమునుపే హీరోయిన్ గా పరిచయమై మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొన్న సుమలతను అప్పట్లో ఏయన్నార్ స్వయంగా "మా అబ్బాయి (నాగార్జున)ను పెళ్లి చేసుకొంటావా?" అని అడిగాడట. 

అప్పటికి నాగార్జున హీరోగా ఎంట్రీ ఇవ్వకపోవడం, ఇప్పుడున్నంత అందంగానూ లేకపోవడంతో సుమలత సుముఖత చూపలేదట. ఇటీవల ఓ షో కోసం తన పాత జ్ణాపకాలను నెమరువేసుకొన్న సుమలత ఈ కబుర్లన్నీ చెప్పింది. మరి అప్పట్లో అంటే అందగాడు కాదు అని "నో" చెప్పింది. మరి ఇప్పడు నవమన్మధుడిగా పిలవబడే నాగార్జునను చూసి "మిస్" అయ్యాను అనుకొంటుందేమో! 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com