
మూడు సూపర్ హిట్ల అనంతరం కొంతకాలం గ్యాప్ తీసుకొని అజిత్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల లాంఛనంగా మొదలైంది. కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్.
ఇకపోతే.. ఈ చిత్రంలో కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందని సమాచారం. సెకండ్ హీరోయిన్ మాత్రం కాదని, కథలో కీలకమైన మలుపు తిప్పే పాత్ర అని చిత్ర బృందం చెబుతోంది. అయితే.. అజిత్ మునుపటి చిత్రంలో అక్క శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, ఇప్పుడు తాజా చిత్రంలో చెల్లెలు అక్షర హాసన్ కీలకపాత్రలో పోషించడం గమనార్హం!




.jpg)

