Home

»

Latest News

పవన్ మళ్ళీ మొదలెట్టాడా ?

Jul 22, 2016 10:45AM

 

నటుడిగా పవన్ కళ్యాణ్ కు ఆకాశాన్ని తాకే స్టార్ డమ్ ఉన్నప్పటికీ.. రచయితగా-దర్శకుడిగా మాత్రం కనీస స్థాయి గుర్తింపు కూడా లేదు. ముఖ్యంగా రచయితగా "జానీ, సర్దార్ గబ్బర్ సింగ్" సినిమాలతో రచయితగా పవన్ కళ్యాణ్ పనికిరాడని అందరూ తేల్చేశారు. కానీ ఒక నటుడిగా కంటే ఒక రచయితగానే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడే పవన్ కళ్యాణ్ మరోమారు తనలోని రచయితకు పని చెప్పబోతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్న పవర్ స్టార్ ఈ సినిమాకి స్క్రిప్ట్ పనుల్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఆకుల శివ కథ సమకూర్చిన ఈ చిత్రం స్క్రీన్ ప్లే విషయంలో పవన్ ఇన్వాల్వ్ అవుతూ కొన్ని మార్పులు చెబుతున్నాడట. ఆల్రెడీ రెండుసార్లు రైటర్ గా ఫెయిలయ్యాక కూడా పవన్ కళ్యాణ్ కు ఈ దురద అవసరమా అని సినిమా అభిమానులు తిట్టుకొంటుండగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం "బాబోయ్ మళ్ళీనా?" అని తెగ కంగారుపడిపోతున్నారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com