ఓటీటీలో సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా'.. రిలీజ్ ఎప్పుడంటే?
on Oct 21, 2021
'కలర్ ఫొటో' సినిమాతో కమెడియన్ నుంచి హీరోగా ప్రమోట్ అయ్యాడు సుహాస్. ఆ మూవీ సక్సెస్ తో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ డ్రామా'. మెహెర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుహాస్ సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.
'ఫ్యామిలీ డ్రామా' సినిమా ఈ నెల 29 నుంచి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా 'సోని లివ్' మూవీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసింది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సుహాస్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే మ్యూజిక్, సినిమాటోగ్రఫీతో పాటు ఆర్టిస్టుల పర్మార్మెన్స్ లు చాలా ప్లస్ అయ్యాయి. మరి ఈ సినిమాతో సుహాస్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్ తేజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్, అనూష నూతుల, శ్రుతి మెహర్, సంజయ్ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి అజయ్, సంజయ్ సంగీతం అందించారు.
Also Read