`బీస్ట్`తో హ్యాట్రిక్ దక్కేనా!
on Oct 21, 2021
తమిళనాట అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన `కొలమావు కోకిల`(2018) కోసం ఫస్ట్ టైమ్ మెగాఫోన్ పట్టిన నెల్సన్.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే.. మూడేళ్ళ విరామం అనంతరం తన రెండో చిత్రం `డాక్టర్`తో ఇటీవల మరోసారి పలకరించాడు నెల్సన్. తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనూ `వరుణ్ డాక్టర్` పేరుతో అనువాదమై మంచి ఫలితాన్ని దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో.. నెల్సన్ దిలీప్ కుమార్ మూడో చిత్రం `బీస్ట్`పైనే అందరి దృష్టి ఉందిప్పుడు. కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ పార్ట్ పూర్తిచేసి.. 2022 ఆరంభంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి.. `కొలమావు కోకిల`, `డాక్టర్`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన నెల్సన్.. `బీస్ట్`తో హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.
Also Read