ssmb 29 నుంచి మకుట ని తప్పించారా? వైరల్ అవుతున్న న్యూస్
on Sep 16, 2025
.webp)
'ssmb 29 'ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది. ఈ మేరకు 'రామోజీ ఫిలిం సిటీ'(RfC)లో వేసిన భారీ సెట్టింగ్స్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ వరకు జరిగే ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటు, చిత్ర ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రియాంకచోప్రాతో మరికొంత మంది ప్రపంచ నటులు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో 'ssmb 29 'పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ మూవీగా ముస్తాబవుతుంది.
ssmb 29 యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'విజువల్ ఎఫెక్ట్స్'(VFX)కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా ఈ చిత్రానికి 'విఎఫ్ఎక్స్' బాథ్యతలని నిర్వహిస్తున్న 'మకుట'(Makuta)ని తప్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర, ఈగ, బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 , ఆర్ ఆర్ ఆర్, వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలకి సంబంధించిన విఎఫ్ఎక్స్ ని 'మకుట' నే అందించింది. రాజమౌళి దర్శక మేధస్సు నుంచి వచ్చిన ఆయా చిత్రాలకి 'విఎఫ్ఎక్స్ 'ఎంతో ముఖ్యం. పైగా ఆయా చిత్రాల 'విఎఫ్ఎక్స్' వర్క్స్ కథలో మిళితమైనవి. దీంతో 'విఎఫ్ఎక్స్' బాగుంటేనే సినిమా విజయవంతమవుతుంది. ఈ విషయం ఆయా చిత్రాలు చూసిన ప్రతి ప్రేక్షకుడికి తెలుసు. ఆయా చిత్రాల విజయం తాలూకు పెరగడంలో కూడా 'మకుటా' ప్రధాన పాత్ర పోషించింది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో 'మకుట' కి భారతదేశంలోనే అగ్ర నిర్మాణ సంస్థ.
2008 లో అమీర్ ఖాన్,అల్లు అరవింద్ ల 'గజనీ' తో విఎఫ్ఎక్స్ రంగంలోకి అడుగుపెట్టిన 'మకుట' కి హైదరాబాద్ తో పాటు, వరల్డ్ వైడ్ గా ఎన్నో బ్రాంచ్ లు ఉన్నాయి. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ గెలుచుకోవడంతో పాటు, ఈగ, మగధీర సినిమాకి 'ఇండియన్ గవర్నమెంట్' చేత నేషనల్ అవార్డు ని సైతం అందుకుంది. అలాంటిది ssmb 29 టీం 'మకుట' ని తప్పించడం ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. కమలా కన్నన్(kamala Kannan)మకుట సంస్థ అధినేత.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



