క్రిష్‌కి, రాజమౌళికి చిచ్చుపెట్టింది ఇతనే...?
on Mar 4, 2017
.jpg)
నటసింహ నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిని అతి తక్కువ సమయంలోనే అద్భుతంగా తీర్చిదిద్ది విమర్శకుల చేత శభాష్ అనిపించుకున్నాడు క్రిష్. బాలయ్య అభిమానులు, పరిశ్రమ పెద్దలు అంతా క్రిష్‌కి జిందాబాద్‌లు కొట్టారు. మంచి సినిమా తీసిన వారిని ఎప్పుడూ ప్రొత్సహించే దర్శకధీరుడు రాజమౌళి కూడా క్రిష్‌ని తెగ పొగిడేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి అద్భుతంగా ఉందని..నీ నుంచి మేం చాలా నేర్చుకోవాలి క్రిష్ అంటూ ట్వీట్లు హోరెత్తించాడు. అంతేకాదు స్వయంగా యాంకర్‌గా మారి క్రిష్‌ని ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఈ ఇంటర్వ్యూని పత్రికల్లో వేసుకుంటామని క్రిష్ టీమ్ అడగటమే ఈ ఇద్దరు దర్శకుల మధ్య చిచ్చు రాజేసింది.
రాజమౌళి పేరిట పత్రికల్లో అచ్చయిన ఒక ఉత్తరం ప్రకంపనలు సృష్టించింది. క్రిష్ టీమ్ ఆ ఉత్తరం రాసేటప్పుడు కాస్త అతి చేసిందట. ముఖ్యంగా సాయిమాధవ్ బుర్రా గోరంతలు కొండంతలు చేసి రాయడం మీడియా దాన్ని నెగిటీవ్‌గా పబ్లిసిటీ చేయడం రాజమౌళికి ఆగ్రహం కలిగించింది. క్రిష్ దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా బెడిసికొట్టిందని ఫిల్మ్‌నగర్ టాక్. చివరికి రాజమౌళి ట్విట్టర్‌లో క్రిష్ టీమ్‌కి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టే వరకు వెళ్లిందట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందా లేదా అన్నది పక్కనపెడితే ఒక రకంగా సాయిమాధవే ఇంత రచ్చకి పరోక్షంగా కారకుడయ్యాడని అంటున్నారు సినీ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



