మొన్న మహేష్, నేడు రాజమౌళి.. ధమ్ ధమ్ చెయ్యొద్దు!
on May 29, 2023
కొత్త కుర్రాడు సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా మే 26న విడుదలై పరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ని బాగానే ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుని, దర్శకధీరుడు రాజమౌళిని మెప్పించడం విశేషం.
'మేమ్ ఫేమస్' విడుదలకు ముందుగానే స్పెషల్ షో చూసిన మహేష్.. సినిమా అదిరిపోయిందని టీమ్ ని ప్రశంసిస్తూ విడుదలకు కొద్ది గంటల ముందు ట్వీట్ చేశాడు. ఇక సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత టీం ని ప్రశంసిస్తూ తాజాగా రాజమౌళి కూడా ట్వీట్ చేశాడు. "చాలా కాలం తర్వాత థియేటర్‌లో ఓ సినిమాని బాగా ఎంజాయ్ చేశాను. సుమంత్ కోసం ఈ సినిమా చూడండి. నటుడిగా, దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. సినిమాలో అన్ని పాత్రలను చక్కగా మలిచారు. నటీనటులు సహజంగా నటించారు. ముఖ్యంగా అంజి మామ ఆకట్టుకున్నాడు. ఇది అందరూ చూడదగ్గ చిత్రం" అని రాజమౌళి ట్వీట్ చేశాడు. అంతేకాదు 'మేమ్ ఫేమస్'లోని "యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలె.. ధమ్ ధమ్ చెయ్యొద్దు" అనే డైలాగ్ ని కూడా ఆయన ట్వీట్ లో జోడించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
