Home

»

Latest News

పవన్‌తో సినిమా అసాధ్యమే... తేల్చేసిన రాజమౌళి!

Apr 21, 2020 10:07AM

 

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తే చూడాలి అనేది వీరిద్దరి అభిమానులతో పాటు సగటు తెలుగు సినిమా ప్రేక్షకుల కోరిక. అయితే... ప్రాక్టికల్‌గా పవన్‌తో తాను సినిమా చేయడం సాధ్యం కాదని రాజమౌళి స్పష్టం చేశారు. ఆల్రెడీ ఒకసారి పవన్ స్టార్‌తో సినిమా చేయడానికి ప్రయత్నించాననీ, కానీ కుదరలేదని అతడు చెప్పుకొచ్చాడు.

"ఇంతకు ముందు పవన్ కళ్యాణ్‌ని ఒకసారి కలిశా. దర్శకులు అందరూ కోరుకున్నట్టు నేనూ ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. కానీ, కుదరలేదు. ఇప్పుడు ఆయన సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినా... ఫుల్ ఫోకస్ రాజకీయాలపై ఉంది. సినిమాలకు తక్కువ, రాజకీయాలకు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. నేను సినిమాలు తీయడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటా. అందుకని, మా కాంబినేషన్లో ప్రాక్టిక‌ల్‌గా సినిమా కుదరదు" అని రాజమౌళి తేల్చేశారు.

ఒకవేళ పవన్ కళ్యాణ్ స్టామినాకి తగ్గట్టు కథ, క్యారెక్టర్ దొరికితే ఆయనతో సినిమా చేసే విషయం ఆలోచిస్తానని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతానికి అయితే సినిమా చేసే ఆలోచనలో లేద‌న్నారు. ఒకవేళ చేస్తే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాకుండా, కమర్షియల్ సినిమా చేస్తానని అన్నారు.  అన్నట్టు... మెగాస్టార్ చిరంజీవి హీరోగానూ ఒక సినిమా చేయడానికి ప్రయత్నించగా కుదరలేదని రాజమౌళి చెప్పుకొచ్చారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com