Home

»

Latest News

మెగాస్టార్ మాటతో అవాక్క‌యిన అభిమానులు

Apr 21, 2020 10:18AM

 

ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఇండస్ట్రీలో కాళ్లు అరిగేలా తిరిగేవారు ఎందరో! నటీనటులు, దర్శకులు, స్వరకర్తలు, 24 శాఖల్లో ప్రతి విభాగంలోనూ ఒక్క ఛాన్స్ వస్తే తమ ప్రతిభను నిరూపించుకోవడానికి చూస్తారు. దర్శకుడు మెహర్ రమేష్ కి ఒక్క ఛాన్స్ కాదు నాలుగు ఛాన్సులు వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా 'కంత్రి', 'శక్తి'... ప్రభాస్ హీరోగా 'బిల్లా'‌... వెంకటేష్ హీరోగా 'షాడో' సినిమాలు మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చినవే. 'శక్తి', 'షాడో' అయితే డిజాస్ట‌ర్స్‌ అయ్యాయి. మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టి కూడా చాలా కాలమే అయింది. ఈ సమయంలో అతనికి మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇస్తున్నానని చెప్పడమే అభిమానుల్లో కలవడానికి కారణమైంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత 'రన్ రాజా రన్', 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో మలయాళం హిట్ 'లూసిఫర్' రీమేక్ చేయనున్నారు. ఆ తర్వాత దర్శకుడు బాబీతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో మెహర్ రమేష్ కూడా తనకు క‌థ‌ చెప్పినట్టు తెలిపారు. అతడి తో సినిమా చేసే అవకాశం ఉందన్నారు. మెగాస్టార్ మాటతో అభిమానుల్లో కలవరమే కాదు... టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారి అవాక్కయ్యింది. మళ్లీ మెహర్ రమేష్ మెగాఫోన్ పడతారని ఎవరూ అనుకోలేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే... మెహర్ రమేష్ ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి లేదు. హీరోలను స్టైలిష్ గా చూపించడంలో అతనికి అతనే సాటి. బహుశా.... ఆ క్వాలిటీ నచ్చే చిరంజీవి అవకాశం ఇచ్చారు ఏమో? అందులోనూ మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ బంధువు కూడా!!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com