తేడా మీ చూపులో ఉంది.. మా రూపులో కాదు
on Sep 15, 2017
శ్రియకు కోపమొచ్చిందండోయ్... ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ పై అంతెత్తు లేచింది. కోపం తెప్పించేంత చిలిపి ప్రశ్న ఆ జర్నలిస్ట్ ఏమడిగాడు? అనేగా మీ డౌట్. అక్కడికే వెళ్తున్నా.అందానికి, గ్లామర్ కీ, సెక్సీనెస్ కీ.. తేడా ఏంటి? అనడిగాడు. హీరోయిన్ల వేషధారణపై వస్తున్న విమర్శలపై మీ స్పందన ఏంటి? అనడిగాడు. ఇలాంటి విషయాల్లో మీరు కూడా విమర్శలను ఎదుర్కొన్న సందర్భాలున్నాయ్ కదా! అని గుర్తు చేశాడు. అక్కడే ఈ ముంబాయ్ భామకు చిర్రెత్తుకొచ్చింది. ఇక గయ్ మని తగాదాకు లేచింది. ‘ఏమనుకుంటున్నారు మీరు?. మేం... చీర కట్లుకొని కనిపిస్తే ఓల్డ్ ఫ్యాషన్ అని పెదవి విరుస్తారు. మోడ్రన్ డ్రస్సుల్లో కనిపిస్తే.. వామ్మో.. ఇంత తెగింపా అంటారు. ఎలా కనబడ్డా మాపై విమర్శలు తప్పవ్. అసలు నా దృష్టిలో దేని అందం దానిదే.
చూసే మీ దృష్టి కోణంలోనే మార్పంతా. అందం, గ్లామర్, సెక్సీనెస్.. అనేవి కూడా మీ చూపుని బట్టే ఉంటుంది తప్ప.. మా రూపుని బట్టి కాదు. అందంగా కనిపించడం కథానాయికల ధర్మం’అంటూ ట్యూషన్ చెప్పేసింది శ్రియ. తమిళ నాడులో ‘శివాజి’ ఫంక్షన్ కి నాటి ముఖ్యమంత్రి కరుణానిధి ముఖ్య అతిథిగా వస్తే... అంత పెద్ద వాళ్ల సమక్షంలో.. ఒళ్లంతా కనిపించే దుస్తుల్లో దర్శనిమిచ్చి అప్పట్లో పెద్ద వివాదానికే తెరలేపింది శ్రియ.. గుర్తుందా!