శ్రీను వైట్ల దర్శకత్వంలో బెల్లంకొండ!
on Apr 11, 2023

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా సీనియర్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే వి.వి. వినాయక్, భీమినేని శ్రీనివాస రావు, బోయపాటి శ్రీను, శ్రీవాస్, తేజ వంటి దర్శకులతో పని చేసిన శ్రీనివాస్.. ఇప్పుడు మరో సీనియర్ దర్శకుడు శ్రీను వైట్లతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
'ఆనందం', 'సొంతం', 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను', 'రెడీ', 'దూకుడు' వంటి ఎంటర్టైనర్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వైట్ల కొంతకాలంగా దూకుడు తగ్గించాడు. 2013 లో వచ్చిన 'బాద్‍షా' తర్వాత ఆయన హిట్ చూడలేదు. ఈ పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే తీసి, ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయిన ఆయన రేసులో బాగా వెనకబడిపోయాడు. చివరిగా ఆయన దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని'(2018) అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత 'ఢీ' సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకున్నా ఎందుకనో అది సాధ్యం కాలేదు. నాలుగైదేళ్లుగా మెగాఫోన్ పట్టుకొని ఆయన.. ఇప్పుడు బెల్లంకొండ కోసం మెగాఫోన్ పట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైనర్ తెరకెక్కనుందని సమాచారం. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ప్రియదర్శిని రామ్ కథ అందిస్తున్నట్లు వినికిడి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు.
కాగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బెల్లంకొండ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే 'భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



