Home

»

Latest News

శ్రీకాంత్ తో పోసాని వై.యస్.ఆర్. జీవిత కథ

Apr 7, 2011 2:27PM

srikanth wallpapers, srikanth stills, srikanth images, srikanth pics, srikanth photos, srikanth picturesశ్రీకాంత్ తో పోసాని వై.యస్.ఆర్. జీవిత కథ ఆధారంగా ఒక చలన చిత్రాన్ని తెలుగు భాషలో నిర్మించనున్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ సినీ రచయిత, నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రముఖ రాజకీయ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.యస్.రాజశేఖర రెడ్డికి వీరాభిమాని. ఆ అభిమానంతోనే వై.యస్.ఆర్. జీవిత చరిత్రకు వెండితెర రూపం ఇవ్వాలనుకుంటున్నారు. అయితే వై.యస్.ఆర్. పాత్రలో ప్రముఖ హీరో శ్రీకాంత్ నటిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.


గతంలో వై.యస్.ఆర్. పాత్రలో నటుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నటిస్తే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వై.యస్.ఆర్. జీవిత చరిత్రను చలన చిత్రంగా రూపొందిస్తామని చెప్పినా కొన్ని అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం పొందలేదు. ఆ తర్వాత "భగీరథుడు" పేరుతో సీనియర్ హీరో వినోద్ కుమార్ వై.యస్.ఆర్. పాత్రలో నటించగా వై.యస్.ఆర్. జీవిత చరిత్రకు చలనచిత్ర రూపమ అందించారు. కానీ వై.యస్.ఆర్. జీవిత చరిత్రకు పోసాని కృష్ణ మురళి వెండితెర రూపం ఇచ్చే స్టైలే విభిన్నంగా ఉంటుందని చెప్పక్కరలేదుగా...!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com