Home

»

Latest News

ఇలియానాపై అశ్వనీదత్ ఫిర్యాదు

Apr 7, 2011 2:48PM

ileana hot wallpapers, ileana hot stills, ileana hot images, ileana hot pics, ileana hot photos, ileana hot picturesiఇలియానాపై అశ్వనీదత్ ఫిర్యాదు చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అయిన చలసాని అశ్వనీదత్ తను నిర్మించగా ఇటీవల విడుదలైన "శక్తి" చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఇలియానాపై ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మండలి (ఎ.పి.ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) లో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఎందుకయ్యా అంటే యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా ద్విపాత్రాభినయంలో నటించగా, ఇలియానా హీరోయిన్ గా నటించగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో తాను నిర్మించిన 45 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం"శక్తి" చిత్రం యొక్క ప్రమోషన్ కోసం హీరోయిన్ ఇలియానా రావటం లేదని అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మండలిలో కంప్లైట్ చేశారట.


ఈ విషయంపై ఇలియానాని కాంటాక్ట్ చేద్దామంటే ఆమె సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుంది. అయినా అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు... ఫ్లాపయిన సినిమాకు పబ్లిసిటీ ఎందుకు దండగ. ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పాలి. అశ్వనీదత్ గారికి మీడియా అంటే ఎప్పుడూ చాలా చిన్నచూపు. విషయం ఆయన నిర్మించిన అనేక చిత్రాలు విడుదలైన సందర్భంగా రుజువయ్యింది. మరి ఇప్పుడు ఈ "శక్తి" చిత్రం విషయంలో మాత్రం దత్తు గారికి మీడియా మీద ఎక్కడలేని ప్రేమ పోంగుకొస్తోంది. అందుకనే రేపు ఫిలిం ఛాంబర్ లో మీడియాను సకుటుంబంగా తన "శక్తి" సినిమా చూసేందుకు, విందు గుడిచేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీని భావమేమి తిరుమలేశ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com