కూతురి డేటింగ్‌కు శ్రీదేవి గ్రీన్‌సిగ్నల్..?
on Nov 25, 2016

మామూలు వ్యక్తుల పిల్లలే ఏమైనా చేస్తే క్షణంలో ఊరంతా పాకిపోతున్న ఈ రోజుల్లో సెలబ్రిటీల పిల్లలైతే ఇక చెప్పేదేముంది. ఆ వార్త బయటకు రావడం ఆలస్యం టీవీలు, పేపర్లు కోడై కూసి దానికి ఎక్కడా లేని పాపులారిటీ తెచ్చిపెడతాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే శ్రీదేవి, బోనీకపూర్‌ల పిల్లలు జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌లకు స్టార్ కిడ్స్‌గా బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
.jpg)
రీసెంట్‌గా శ్రీదేవి కూతురు జాన్వి పైన చెప్పినట్లుగానే వార్తల్లో నిలిచింది. జాన్వి తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరూ కిస్ చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం పెద్ద దుమారాన్నే రేపాయి. శిఖర్ మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. అతనితో తన కూతురు డేటింగ్ చేయడం అతిలోక సుందరికి అస్సలు ఇష్టం లేదట. కానీ తాజాగా షారుఖ్, అలియా భట్‌లు నటించిన డియర్ జిందగీ ప్రీమియర్ షోకి శ్రీదేవి, బోని కపూర్ దంపతులతో పాటు జాన్వి, శిఖర్‌లు కలిసి వెళ్లారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు బయటకురావడంతో శిఖర్, జాన్విల డేటింగ్‌కు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీటౌన్‌లో చర్చించుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



