యువ హీరో మతిస్థిమితం కోల్పోయాడా! లోకేష్ కనగరాజ్ పోస్ట్ వైరల్
on Apr 18, 2025
హిట్ చిత్రాల దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(LOkesh Kanagaraj)ప్రస్తుతం సూపర్ స్టార్ 'రజినీకాంత్'(Rajinikanth)తో 'కూలీ'(Coolie)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna)కూడా ఒక కీలక పాత్ర చేస్తుండటంతో 'కూలీ'పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకుడుగా పరిచయమైన తొలి చిత్రం 'మా నగరం'. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీనటరాజన్(Sri natarajan)సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితం 'శ్రీ నటరాజన్' సోషల్ మీడియా వేదికగా కొన్ని అభ్యంతరకర వీడియోలు షేర్ చేసాడు. పైగా గుర్తుపట్టలేని విధంగా రూపురేఖలు మొత్తం మారిపోయాయి. దీంతో శ్రీ నటరాజన్ మానసిక పరిస్థితి సరిగా లేదంటు రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పుడు వాటిపై నటరాజన్ కుటుంబ సభ్యులు విడుదల చేసిన స్టేట్ మెంట్ ని లోకేష్ కనగరాజ్ తన 'ఎక్స్ 'వేదికగా పంచుకున్నాడు. నటరాజన్ కుటుంబ సభ్యులు సదరు స్టేట్ మెంట్ లో 'నటరాజన్ ప్రస్తుతం వైదుల పర్యవేక్షణలో ఉండటం వలన కొన్ని రోజుల పాటు సామాజిక మధ్యమాలకి దూరంగా ఉంటాడు. దయచేసి మా బాబు వ్యక్తిగత గోప్యానికి భంగం కలిగించవద్దు. నటరాజన్ ఆరోగ్య పరిస్థితి పై వస్తున్న వార్తలు కూడా మమ్మల్ని ఎంతగానో బాధపెడుతున్నాయి. సోషల్ మీడియాలో ఎవరైనా మా అబ్బాయి గురించి అభ్యంతకర వీడియోలు చేస్తే తొలిగించెయ్యండని విన్నపం చేస్తున్నామని పేర్కొన్నారు.
2012 లో విడుదలైన వజక్కు ఎన్ 18 /9 చిత్రం ద్వారా పరిచయమైన శ్రీనటరాజన్ ఆ తర్వాత 'ఓనా యుమ్ ఆట్టుక్కుట్టియుమ్', సన్ పాపడి, విల్ అంబు లాంటి చిత్రాల్లో హీరోగా చేసాడు. చివరిగా 2023 లో విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కిన 'ఇరుగుపట్రు' లో కీలక పాత్ర పోషించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
