త్వరలో టాప్ హీరోతో శ్రీను వైట్ల సంచలన చిత్రం!?
on Sep 24, 2022

తనదైన శైలిలో వినోదాన్ని పండిస్తూ బ్లాక్ బస్టర్స్ అందించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు దర్శకుడు శ్రీను వైట్ల. 23 సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా నటించిన 'నీ కోసం' (1999) మూవీతో దర్శకుడిగా పరిచయమై, మొదటి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డ్ అందుకుని సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్ మొదలు పెట్టారు.
అందరూ కొత్తవారితో నిర్మించిన 'ఆనందం' (2002)తో భారీ విజయం సాధించి పరిశ్రమలో సంచలనం సృష్టించారు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ లాంటి మెమొరబుల్ హిట్స్ సాధించిన శ్రీను వైట్ల 'దూకుడు' (2011)తో తిరుగులేని హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన 'బాద్ షా' (2013)తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలు అందించిన ఘనత శ్రీను వైట్ల సొంతం. నేడు (సెప్టెంబర్ 24) పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీను వైట్ల అతి త్వరలో ఒక అగ్ర హీరోతో కలిసి భారీ ప్రాజెక్ట్ తో మరో సారి తన మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ కి సంబంధించిన ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. చక్కని కథతో పాటు తన మార్క్ వినోదంతో ఈ చిత్రాన్ని తీయబోతున్నట్లు సమాచారం. ఈ రోజు (సెప్టెంబర్ 24) పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీను వైట్లకు శుభాకాంక్షలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



